📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,030,216  |  363 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Hyderabad ⚡ AMP

ఇల్లు లేని నిరుపేదలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త

July 1, 2024 July 1, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఇల్లు లేని నిరుపేదలకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలో అర్హులైన అభ్యర్థులందరికీ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. సోమవారం మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-2025 బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గట్టి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఎన్నికల నిబంధనల వల్లే ఇందిరమ్మ ఇంటి పథకం అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!