హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా అంతరాయం

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో భాగంగా కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డయా వాల్వులను అమర్చనున్నారు. ఈ పనులు 17.02.2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి 18.02.2025 మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి.

నీటి సరఫరా అంతరాయం కలిగే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎం డివిజన్-6

ఎస్.ఆర్.నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఫతేనగర్.

2. ఓ అండ్ ఎం డివిజన్-9

కూకట్‌పల్లి, వివేకానందనగర్, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, కేపీహెచ్‌బీ, హస్మత్‌పేట్.

3. ఓ అండ్ ఎం డివిజన్-12

చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, భగత్‌సింగ్‌నగర్, జగద్గిరిగుట్ట.

4. ఓ అండ్ ఎం డివిజన్-13

అల్వాల్, మచ్చబొల్లారం, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్‌నగర్.

5. ఓ అండ్ ఎం డివిజన్-14

చెర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా.

6. ఓ అండ్ ఎం డివిజన్-15

కొండాపూర్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు).

7. ఓ అండ్ ఎం డివిజన్-17

హఫీజ్‌పేట్, మియాపూర్.

8. ఓ అండ్ ఎం డివిజన్-21

కొంపల్లి, తూంకుంట, దమ్మాయిగూడ, నాగారం.

9. ఓ అండ్ ఎం డివిజన్-22

నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, తెల్లాపూర్.

10. ట్రాన్స్ మిషన్ డివిజన్-4

ఎంఈఎస్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్.

11. ఆర్ డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు

ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్‌పూర్ (మేడ్చల్).

అందువల్ల, ప్రస్తావించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!