TG : కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు టీజీఆర్టీసీ శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్ నుంచి నేరుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటివరకు నేరుగా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న భక్తులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తోంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుల టికెట్లను ఆన్లైన్ ద్వారా ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. టీజీఆర్టీసీ ఈ సర్వీసులు కార్తీక పౌర్ణమి రోజుల్లో కొనసాగుతాయని ప్రకటించింది.
![]()
