పదవి విరమణ పొందుతున్న వారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జి.ఎం ఆఫీస్ నందు ఏరియా ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ, ఈనెల 30 సోమవారం రోజున పదవి విరమణ చేయుచున్న శ్రీ వల్లూరి.వెంకట.దుర్గాప్రసాద్, సింగరేణి సంస్థ యందు 36 సంవత్సరాలు వివిధ హోదాలో ఉద్యోగం నిర్వహించి, పదవి విరమణ పొందుతున్నoదున వారికి ఏరియా వర్క్ షాప్ నందు వర్క్ షాప్ హెచ్.ఓ.డి, టి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది, ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, వర్క్ షాప్ ఇంజనీర్స్,బి.శంకర్, టి అనిల్, ఏ. ఉపేందర్ బాబు,ఐఎన్టియుసి కార్యదర్శి ఎండి సత్తార్ పాష,ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఎలక్ట్రికల్ మెకానికల్ ఫోర్ మెన్స్,యు.రమేష్ బాబు,డి.భానుచందర్, ఎస్.డి.యాకుబుద్దీన్, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏ.జి.యం మాట్లాడుతూ,కొత్తగూడెం ఏరియాలోనీ ఏరియా వర్క్ షాప్ గుండెకాయ లాంటిది ఏరియా లో ఉన్న ఓపెన్ కాస్ట్, మైన్స్, మరియు డిపార్ట్మెంట్ లలో ఏ అవసరం వచ్చిన ముందుగా వర్క్ షాప్ గుర్తుకువస్తుంది, గేరబాక్స్, పంప్స్, మోటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ప్రతిదీ వర్క్ షాప్ లో రిపేర్ చేసి వెంటనే ఏర్పాటు చేయడంలో వారి నైపుణ్యం,కనుపరుస్తూ శ్రద్దవహించి, ప్రొడక్షన్ ప్రోడక్టివిటీ లో సహయా సహాకారం అందిస్తూ, కొత్తగూడెం ఏరియా ముందు వరసలో ఉందని చెప్పవచ్చు, వర్క్ షాపు నందు కార్మిక నాయకులు, అధికారులు, టెక్నిషన్స్, సూపెర్వైజర్స్, ఉద్యోగుల, కలయిక తో ఇది సాధ్యమవుతుందని వారు, ఈ సందర్బంగా తెలియచేసారు, రజాక్,ఇంజనీర్స్ మాట్లాడుతు ఏ. జి.ఎం, రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యలతో,కుటుంబ సభ్యులతో సుఖంగా ఉండాలని,, ఈ సందర్బంగా తెలియచేసారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!