📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, September 23, 2026
Visitors: 9,388  |  797 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురిమ్స్‌లో ముగ్గురు శిశువుల మృతి.. ప్రభుత్వ వైఫల్యమే : డా. చుంచు రాజ్ కిరణ్ప్రేమపెళ్లిళ్లను నిషేధిస్తూ గ్రామసభ తీర్మానంతీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘంLatest Breaking News from PressMeetతాజా వార్తలురిమ్స్‌లో ముగ్గురు శిశువుల మృతి.. ప్రభుత్వ వైఫల్యమే : డా. చుంచు రాజ్ కిరణ్ప్రేమపెళ్లిళ్లను నిషేధిస్తూ గ్రామసభ తీర్మానంతీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘం
Adilabad ⚡ AMP

తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్

September 23, 2026 17 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

వాయుగుండం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు.. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది.

వాయుగుండానికి తోడు కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కొన్ని ప్రాంతాల్లో 20.4 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మరికొన్ని చోట్ల 11.5 నుంచి 20.4 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇతర జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

బుధవారం రెడ్ అలర్ట్

బుధవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

గురువారం కూడా భారీ వర్షాలు

గురువారం కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగనుంది.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

25, 26 తేదీల్లోనూ వర్షాలు

వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 25, 26 తేదీల్లోనూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అత్యంత భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, నదుల పరిసరాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!