తెలంగాణలో ఎండలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సాధారణంగా మే నెలలో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ఈసారి ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తు ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
![]()



