తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో కూడిన మధ్య తెలంగాణ, ఏపీలోని మధ్య కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ‘సూపర్ ఎల్ నినో’ ఆందోళన ఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు ఈ వర్షాలు ఎంతో ఊరటనిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
![]()




