అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు మళ్లీ ముదరడంతో ఇరాన్ కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ని గురువారం పూర్తిగా మూసివేసింది. ఈ మార్గంలో చమురు ట్యాంకర్లపై దాడులు చేస్తామని హెచ్చరించడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా, నిఫ్టీ 100, సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో 30 పైసలు క్షీణించి చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది.
![]()




