డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. 5 నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక ఫలితాలను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపి సరికొత్త రికార్డు సృష్టించింది. ‘మీ సేవ’ సాంకేతిక సహకారంతో సుమారు 18 లక్షల మంది విద్యార్థుల రిపోర్ట్ కార్డులను డిజిటల్ రూపంలో చేరవేసింది. ఈ పేపర్‌లెస్ విధానం వల్ల తల్లిదండ్రులకు పాఠశాలలకు వెళ్లే శ్రమ తగ్గడమే కాకుండా, విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించడం సులభతరమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు ఇలాంటి అత్యాధునిక సాంకేతిక మార్పులపై విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![]()



