📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, October 27, 2026
Visitors: 108,518  |  544 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టు
Khammam ⚡ AMP

సింగరేణి గనుల సమీపంలో బెల్ట్ షాపులు బంద్ చేయించండి : సామాజిక సేవకుడు కర్నే బాబురావు

August 25, 2024 August 25, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram
  • ఏరియా ఎస్ ఓ టు GM డి. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకుడు కర్నే బాబురావు

మణుగూరు గనుల సమీపంలో బెల్ట్ షాపులు కార్మికులను రా రమ్మని ఆకర్షిస్తున్నాయని తద్వారా ప్రమాదాలకు కారణ భూతం అవుతున్నాయని తక్షణమే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు సింగరేణి మణుగూరు ఏరియా ఎస్ ఓ టు GM డి. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసినట్లు బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా మైన్స్ కు దగ్గర్లో వైన్స్ అనగా అనేక బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. మూడు ఫుల్లులు ఆరు హాఫూలుగా వర్ధిల్లుతున్నాయని అట్టి బెల్ట్ షాపులకు ఎలాంటి అనుమతులు లేవని సమాచార హక్కు చట్టం ద్వారా తను అడిగిన జవాబుగా ఎక్సైజ్ విభాగం అధికారులు రాతపూర్వకంగా తెలిపారన్నారు. ఇదిలా ఉండగా ఈ బెల్ట్ షాపులు గనులకు దగ్గరలో ఉండటంతో పలురు కార్మికులు మద్యానికి బానిసలు అవుతున్నారు మరి కొంత మంది ప్రమాదాలకు కూడా గురికావడం లేదా కారణం అవుతున్నారు.

అందుకు ఇటీవల సంచలనం సృష్టించిన కూనవరంలో ఆటోను ఢీకొన్న ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలు కావటం మరియు రెండు రోజుల క్రితం కూనవరం గేటు వద్ద వోల్వో డ్రైవర్ ను కారు ఢీకొన్న సంఘటనలో సెక్యూరిటీ గార్డ్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం లాంటి సంఘటనలో దేహశుద్ధి ,”మద్యం మత్తులో సింగరేణి కార్మికులు ప్రమాదాలు “కొంతమంది చేస్తున్న ఇలాంటి సంఘటనల మూలంగా సింగరేణి ఉద్యోగులందరికీ చెడ్డ పేరు వస్తున్నదని దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మద్యానికి బానిసలైన కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రమాదాలకు కారణం అవుతున్న మల్లారం గేటు వద్ద నుండి సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వరకు అనధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులను బంద్ పెట్టే విధంగా ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు కర్నె బాబురావు తెలిపారు. స్థానిక అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు బాబురావు తెలిపారు.ఎస్ ఓ టు GM కూడా సానుకూలంగా స్పందించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

కర్నే బాబురావు

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!