📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 9, 2026
Visitors: 36,479  |  664 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్
Khammam ⚡ AMP

ఏజెన్సీ ఎస్సీల హక్కుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతాం: ఎమ్మెల్యే కూనంనేని

April 2, 2026 April 2, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కొత్తగూడెం అంబేద్కర్‌ కమ్యూనిటీ హాలులో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘ధర్మ పోరాట సభ’ విజయవంతమైంది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏజెన్సీ ప్రాంత ఎస్సీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2019 నూతన పంచాయతీ రాజ్ చట్టం వల్ల ఏజెన్సీ దళితులకు తీరని అన్యాయం జరిగిందని, రద్దయిన స్థానిక రిజర్వేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. .

రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ.. మైదాన ప్రాంత ఎస్సీలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంత దళితులపై ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంట రుణాలు, స్థానిక ఉద్యోగ అవకాశాలు నేడు కరువయ్యాయని, హక్కుల సాధన కోసం దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జేఏసీ రాష్ట్ర నాయకులు గోడ రమేష్, ఎస్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!