తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేయగా, దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మెజారిటీని అసెంబ్లీ వేదికగానే నిరూపించుకోవాలని, గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసిన విజయ్, తనకు తగిన సంఖ్యాబలం ఉందని, ఫ్లోర్ టెస్టుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే, స్పష్టమైన మెజారిటీ లేకుండా అనుమతించలేమని గవర్నర్ స్పష్టం చేయడంతో, విజయ్ తన తదుపరి అడుగుగా ఎమ్మెల్యేలను కూడగట్టుకుంటారా లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
![]()




