పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం, కృష్ణవరం పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి కృష్ణవరంలో పులి ఆవు, దూడను చంపి తినడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతం నుంచి గొట్టువానిపాలెం, గవరయ్యపేట మీదుగా పులి అడుగుజాడలను గుర్తించిన అధికారులు, అది రాజవొమ్మంగి అటవీ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచిస్తూ అటవీ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
![]()

Leave a Reply