ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా తప్పుడు ప్రచారం — దోవల్ ఘాటు స్పందన

పరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌ దాడుల వల్ల భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఖండించారు. దేశ రక్షణపై అనవసరంగా అపోహలు కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తీవ్రంగా స్పందించారు. భారత్‌ తగిన సాంకేతిక సమాచారంతోనే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, స్వదేశీ రక్షణ సాంకేతికతతో ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని వివరించారు.

దోవల్ పాకిస్థాన్‌ వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్‌ క్షిపణుల దాడి వివరించడంతో పాటు, భారత్‌కు నష్టం జరిగిందని ఎవరైనా అంటే దాన్ని రుజువు చేసే ఒక్క ఆధారం చూపాలని సవాలు విసిరారు. పాకిస్థాన్‌ దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్-400’తో సమర్థంగా నిష్క్రియంచేశామని తెలిపారు.

దేశ భద్రత కోసం కేంద్రం ఆత్మనిర్భర్ భారత్‌ ద్వారా రక్షణ సామగ్రిని స్వదేశీ పద్ధతిలో తయారు చేస్తోందని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సాంకేతిక సత్తాకు నిదర్శనమని డోభాల్‌ స్పష్టం చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!