భారతీయ రైల్వే సేవలను ఒకే యాప్‌లో సమగ్రంగా అందించే ఉద్దేశంతో ఇటీవల ప్రారంభించిన ‘రైల్‌వన్’ (RailOne) యాప్, ప్రయాణికులకు వినియోగదోహదంగా మారనుంది. ఈ సూపర్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, రైల్వే సమాచారం, పీఎన్‌ఆర్ స్టేటస్, ప్లాట్‌ఫామ్ నెంబర్ తదితర వివరాలన్నింటినీ ఒకే చోట పొందొచ్చు. యాప్ ఉపయోగించాలనుకుంటే, ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి RailOne యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ ఇచ్చి ప్రారంభించాలి. ప్రారంభ స్క్రీన్‌లో Login, New User Registration, Guest అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. కొత్త యూజర్లు New User Registration పై క్లిక్ చేసి Rail Connect లేదా UTS ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. అప్పటికే Rail Connect లేదా UTS ఖాతా ఉన్నవారు తమ వివరాలతో లాగిన్ అయ్యే వీలుంటుంది.
ఖాతా లేకపోతే, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి Register బటన్ క్లిక్ చేయాలి. తదుపరి స్క్రీన్‌లో పూర్తి పేరు, ఈ-మెయిల్, యూజర్ ఐడి, పాస్‌వర్డ్, క్యాప్చా వివరాలు ఇచ్చి సైన్ అప్ అవ్వాలి. వచ్చిన OTP ద్వారా అకౌంట్‌ను ధృవీకరించి MPIN సెట్ చేసుకోవచ్చు. భద్రత కోణంలో ఫింగర్ ప్రింట్ లాగిన్ వంటివి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు Rail Connect / UTS ఖాతా ముందే ఉందో లేదో యాప్ స్వయంగా గుర్తించి సూచిస్తుంది. ఇక Guest Login ఆప్షన్ ద్వారా మీకు అవసరమైన రైలు సమాచారం, పీఎన్‌ఆర్ స్టేటస్, ట్రాకింగ్ వంటి పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద, భారతీయ రైల్వే వినియోగదారులకు అన్నిరకాల సేవలు అందించాలన్న దృష్టితో రూపొందించిన RailOne యాప్, భవిష్యత్తులో రైలు ప్రయాణానుభవాన్ని మరింత మెరుగుపరిచేలా మారనుంది.