సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై జూన్ 27న చలో కొత్తగూడెం

సింగరేణిలో ఇంకెన్నాళ్లు ఈ కంటతడి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సింగరేణి యాజమాన్యం. సింగరేణి మారు పేర్ల సమస్య పరిష్కరించి కార్మికుల పిల్లలకు న్యాయం చేయాలని గోదావరిఖని ప్రెస్ క్లబ్లో లక్క శ్రావణ్ గౌడ్, జక్కు శ్రవణ్ మాట్లాడుతూ మాయ మాటలు, కాలయాపన ఇక బందు పెట్టి తక్షణమే మారుపేర్ల సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు నియమించాలి.. ఇప్పటికే అనేక సంవత్సరాల నుండి సింగరేణి అధికారులు గానీ యూనియన్లు కానీ ఎలక్షన్ సమయంలో హామీలు ఇస్తూ కాలపరిమితి చేస్తూ ప్రాణాలను సైతం తీసుకుంటున్న ప్రధానమైన సమస్య ఈ మారుపేరుల సమస్య.. ఒకనాడు ఏ పేరు అయినా సరే అని ఉద్యోగానికి తీసుకున్న సింగరేణి యాజమాన్యమే ఈ రోజు కంపెనీ లాభాలోకి వచ్చాక కార్మికులను ఇబ్బంది పెట్టడం సరికాదు.. అలాగే జరిగినటువంటి 2019 ఆర్ ఎల్ సి ఒప్పందంలో కూడా అన్ని యూనియన్ సంఘాలు సంతకాలు చేసి లేబర్ కమిషన్ ఎదుట మారుపేరుల సమస్య పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు కానీ అది కూడా జీవో రిలీజ్ నోచుకోలేకపోయాం..

2025వ సంవత్సరంలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో కూడా మారుపేరుల సమస్యను పరిష్కరిస్తామని సింగరేణి యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం చేసుకున్న ఒప్పందం కూడా ఇప్పటికీ అమలు కాలేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇకనైనా కాలయాపన బంధు పెట్టి తక్షణమే కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. జరగబోతున్న ఛలో కొత్తగూడెం 27 న సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియా కోల్ బెల్ట్ మారు పేర్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితులందరికీ కదలి రావాలి. అలాగే మాకు ఏ కష్టం వచ్చినా సింగరేణి కార్మికుల చూపు యూనియన్ లీడర్ల వైపు మాత్రమే. కావున దయచేసి సింగరేణి అన్ని కార్మిక సంఘాల మద్దతు మాకు ఇప్పుడు కావాలి. దయచేసి అన్ని కార్మిక సంఘాలు చలో కొత్తగూడెం 27న పాల్గొని మా యొక్క సమస్య గురించి సింగరేణి యాజమాన్యాన్ని గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తే మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము. ఇటి ప్రెస్ క్లబ్లో తిరుమల శ్రీనివాస్, పొన్నం వెంకటేష్, కొమ్మూరమ్మ, ప్రదీప్, జిల్లాల శ్రావణ్, కుమార్, డిష్ బాబు, బొద్దుల రంజిత్, గుర్రం సుధాకర్, ఆవుల రాయమల్లు, వంగ సంతోష్, పార్థపల్లి హరీష్, ఈర్ల రాజయ్య, ఓం ప్రకాష్, సందీప్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!