కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0’ నివేదికలో తెలంగాణలోని పలు అంగన్వాడీ కేంద్రాల పనితీరు దయనీయంగా ఉందని వెల్లడైంది. జనగాం, నిర్మల్, భూపాలపల్లి, యాదాద్రి, గద్వాల జిల్లాల్లో కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. పోషకాహార సరఫరాలోనూ తీవ్ర లోపాలు ఉన్నాయనీ, కోడిగుడ్లు, పప్పు ధాన్యాల సరఫరా 30 శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. 6.6 లక్షల పిల్లల్లో సగానికి ఆధార్ ఐడీలు లేవు. రూ.96.5 కోట్లు కేటాయించినప్పటికీ ఐదు జిల్లాల్లో నిధులు వినియోగం ప్రారంభం కాలేదు.
![]()
