డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిగిలో 220 కెవి సబ్‌స్టేషన్ ప్రారంభించి, కొత్తగా తొమ్మిది సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందజేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ చేరిందన్నారు. రైతులకు ఉచిత కరెంట్, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, విద్యా సదుపాయాలతో సమగ్ర సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. పరిగి–వికారాబాద్ అభివృద్ధికి నాలుగు లైన్ రహదారి, సబ్‌స్టేషన్లు, రైల్వే ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయని వెల్లడించారు.
![]()
