ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఇటీవల భారత్ పర్యటనలో భాగంగా దిల్లీ మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోదీ జాకెట్ ధరించి, ఉబెర్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని తన ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ అనుభవం అద్భుతంగా, సమర్థవంతంగా ఉందని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో ఉబెర్ యాప్ ద్వారా మెట్రో, బస్సు, ఆటో వంటి అన్ని రవాణా సేవలను ఒకే చోట అందించడమే తమ లక్ష్యమని, భారత ప్రజా రవాణా వ్యవస్థలతో భాగస్వామ్యం పెంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
![]()




