ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ మరియు చెల్లింపు విధానాలను ఆధునికీకరిస్తోంది. త్వరలో గూగుల్ మ్యాప్స్ ద్వారా బస్సుల సమాచారంతోపాటు, అప్పటికప్పుడే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికులు మొబైల్‌లోనే బస్సును ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయగలరు. అదనంగా, క్రెడిట్ లేదా డెబిట్ కార్డును టిమ్ యంత్రంపై ట్యాప్ చేయగానే టికెట్ జారీ అయ్యే టచ్‌లెస్ చెల్లింపు విధానం కూడా త్వరలో ప్రారంభమవుతోంది. ఈ సేవలను ముందుగా హైదరాబాద్ ఏసీ బస్సుల్లో అమలు చేయనున్నారు.
![]()
