అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘ఆర్టెమిస్-II’ మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించి మరో మైలురాయిని అందుకుంది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి SLS రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దిశగా పయనమయ్యారు. వీరిలో చంద్రుడి వైపు వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. 10 రోజుల పాటు సాగే ఈ మిషన్‌లో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఇది విజయవంతమైతే 2028లో మానవులను నేరుగా చంద్రుడిపైకి దించేందుకు నాసా సిద్ధమవుతోంది.
![]()




