మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖలో, నవంబర్ 15న మాడ్వి హిడ్మా, రాజేతో పాటు మరికొందరిని విజయవాడలో నిరాయుధులుగా అదుపులోకి తీసుకుని క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు. రంపచోడవరం ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు చెప్పటం పచ్చి అబద్ధమని, ఇది పోలీసుల అల్లిన కథ మాత్రమేనని పేర్కొన్నారు. కొందరు ద్రోహుల సమాచారం ఆధారంగా ఎస్ఐబి చర్యలు చేపట్టిందని లేఖలో అన్నారు. ఈ ఘటనలకు నిరసనగా నవంబర్ 23ను దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
![]()
