ఏలూరు జిల్లా నూజివీడు పరిసరాల్లో బైక్ దొంగతనాలపై దృష్టి సారించిన పోలీసులు, ఓ దొంగ తాగిన మత్తులో “నేను 100 బైక్స్ దొంగతనం చేశా, నాపై కేసులు ఉన్నాయి, దమ్ముంటే పట్టుకోండి” అని ఇచ్చిన ఛాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్ పోలీస్ టీమ్ ఐదుగురితో కూడిన అంతర్రాష్ట్ర మోటార్‌సైకిల్ ముఠాను అరెస్ట్ చేసి, రూ.9.08 లక్షల విలువైన 12 బైక్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు ఏలూరు, తిరువూరు, అగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో బైక్ తాళాలను పగలగొట్టి దొంగతనాలు చేసారు. కేసులో 21 ఏళ్ల బంగారు సుబ్రహ్మణ్యం ప్రధాన నిందితుడిగా గుర్తించబడింది.
![]()
