సైబర్ నేరగాళ్లు శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని వాట్సప్ ద్వారా మాల్వేర్‌ను పంపుతున్నట్లు పాలోఆల్టో నెట్‌వర్క్స్ తెలిపింది. గుర్తుతెలియని ఖాతాల నుంచి వచ్చిన చిత్రాలను ఓపెన్ చేయగానే ల్యాండ్‌ఫాల్ స్పైవేర్ ఫోన్‌లోకి చొరబడి కాల్స్, లొకేషన్, కాంటాక్ట్‌లపై నిఘా పెడుతుంది. ఇరాన్, తుర్కియే, మొరాకో వంటి దేశాల్లో ఎస్22, ఎస్23, ఎస్24, జెడ్‌ఫోల్డ్4, జెడ్‌ఫ్లిప్4 ఫోన్లు ప్రభావితమయ్యాయి. సెప్టెంబర్ 2024లో గుర్తించిన ఈ లోపాన్ని శాంసంగ్ ఏప్రిల్ 2025లో సరిచేసింది. తాజా అప్‌డేట్ చేసిన యూజర్లు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు.
![]()
