హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రెండు వేల నాటు కోళ్లను వదిలిపెట్టడంతో గ్రామంలో హడావుడి చెలరేగింది. కోళ్లను చూసి గ్రామస్థులు వాటిని పట్టుకునేందుకు పోటీ పడ్డారు. సమాచారం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కొంతమంది కోళ్లను సేకరించి పశువైద్యాధికారి దీపికకు అందజేశారు. ఆమె వాటిని పరీక్షల కోసం వరంగల్ ల్యాబ్‌కు పంపించి, రిపోర్టు వచ్చే వరకు వీటిని తినరాదని హెచ్చరించారు. ఈ కోళ్లను ఎవరు, ఏ కారణంతో వదిలారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
![]()
