గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు ఘంటా శ్రీనివాసరావు నకిలీ పోలీసు అవతారం ఎత్తి పూజారిని బెదిరించిన ఘటన సంచలనం సృష్టించింది. వైకాపా ప్రచార విభాగం అధ్యక్షుడైన ఆయన, పోలీసు యూనిఫామ్ ధరించి సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ మోటూరు గ్రామంలోని శ్రీ గంగానమ్మ దేవస్థానం పూజారి వెంకటరామయ్యను బెదిరించి ఆలయ తాళాలు లాక్కుని, బోర్ మోటార్‌ను తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో గుడివాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుచేయగా, న్యాయమూర్తి ఈ నెల 19వరకు నిందితుడిని రిమాండ్‌కి పంపించారు.
![]()
