ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. అవినీతి, లంచాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, విజయనగరం జిల్లాలో భోగాపురం, సత్యసాయి జిల్లాలో చిలమత్తూరు సహా పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి వ్యవహారాలపై ఆధారాలు సేకరించడమే లక్ష్యమని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
![]()
