AP రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం మత్స్యలింగం, బి. విరూపాక్షి లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని విమర్శించారు. గత 30 ఏళ్లలో టీడీపీ 13 డీఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని వివరించారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూడు డీఎస్సీల ద్వారా 16,701 పోస్టులు భర్తీ అయ్యాయి అని తెలిపారు. డీఎస్సీ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

Loading

By admin

te Telugu
error: Content is protected !!