ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు చేరుకుంది. బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులపై సమగ్రంగా చర్చించారు. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు చేయాలని నిర్ణయించగా, పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరలో కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలను ఆమోదించారు. నూజివీడు, గన్నవరం, కైకలూరు నియోజకవర్గాల పునర్‌విభజనపై కూడా చర్చించారు. తుది నివేదికను త్వరలో సీఎం చంద్రబాబుకు సమర్పించి, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రులు తెలిపారు.
![]()
