బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేట సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఒంటిగంట సమయానికి కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కర్లపాలెం గ్రామానికి చెందిన బేతాళం బలరామరాజు (65), లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54)లు అక్కడికక్కడే మృతి చెందారు. 13, 11 ఏళ్ల ఇద్దరు బాలురు గాయపడి చికిత్స పొందుతున్నారు. వారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]()
