జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్త జిల్లా ఇన్‌చార్జీల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకాల ద్వారా ప్రతి జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలకు బైరి రమేష్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చిప్పల నర్సింగరావు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు అశోధా భాస్కర్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు అసాది పురుషోత్తం ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు.
ఇక సిరిసిల్ల జిల్లాకు మేడి అంజయ్య, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు బ్యాగరి వెంకటస్వామి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు తుమ్మల రవికుమార్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ర్యాకం శ్రీరాములు నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం మరియు మహబూబాబాద్ జిల్లాలకు చిట్టి మల్ల సమ్మయ్య, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు అనంత రాములు, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలకు వెన్న రాజు, జనగాం జిల్లాకు బుట్టి సత్యనారాయణ, వరంగల్ జిల్లాకు జెల్ల ప్రభాకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు నీరటి రాములు, నిజామాబాద్ జిల్లాకు రొడ్డ రాంచందర్, కొమరంభీం అసిఫాబాద్ జిల్లాకు తొగరు సుధాకర్, అదిలాబాద్ జిల్లాకు బందెల బెంజిమెన్ బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ, ప్రతి ఇన్‌చార్జి తమ జిల్లా కమిటీల పనితీరు, సమన్వయం, సభ్యుల చురుకుదనం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే చేర్పులు, మార్పులు చేయవచ్చని తెలిపారు. ఇన్‌చార్జీలు రాష్ట్ర నాయకత్వానికి నిరంతరం నివేదికలు అందజేస్తూ సంఘ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు మరియు ఇన్‌చార్జీలు పరస్పర సహకారంతో పనిచేస్తూ జాతీయ మాల మహానాడు సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
![]()
