విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం నేరెళ్లవలసలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త నందిక కృష్ణపై భార్య గౌతమి వేడి నీళ్లు పోసింది. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య ఇటీవల తరచూ తగాదాలు జరుగుతున్నాయి. కలహాల నేపథ్యంలో భార్య ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కృష్ణను స్థానికులు విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది

Loading

By admin

error: Content is protected !!