మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావు

మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావును నియమించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు ఈ నియామకాన్ని ప్రకటించారు. ఖమ్మం 52వ డివిజన్‌కు చెందిన కొప్పుల రామారావు (S/o వెంకటేశ్వర్లు) సరిత క్లినిక్ సెంటర్‌లో సేవలు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, పి.వి. రావు ఆశయాల ప్రకారం క్రమశిక్షణతో పని చేస్తానని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు మాల మహానాడు జాతిని తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో త్రికరణ శుద్ధితో మెలుగుతానని ప్రమాణం చేశారు. కేంద్ర, రాష్ట్ర కమిటీలకు పూర్తి విధేయతతో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామల సత్యం, గుడిసె సాల్మన్ రాజ్, రాజీవ్ లింగాల రవికుమార్, రాము మోహన్ రాజు, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఇతర నియామకాలు:

  • జిల్లా ప్రధాన కార్యదర్శి: చప్పిడి ప్రభాకర్ రెడ్డి
  • జిల్లా కార్యదర్శి: గుడిబండ్ల వెంకట్
  • నగర కార్యదర్శి: పేరంపల్లి మధు కుమార్
  • నగర అధ్యక్షుడు: డోకుపర్తి నాగేశ్వరరావు
  • నగర ప్రధాన కార్యదర్శి: పులగం రాజా
  • జిల్లా మహిళా కన్వీనర్: నిమ్మ తోట రోజా
  • జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు: పేరం యశ్వంత్

ఈ నియామకంతో మాల మహానాడు ఖమ్మం జిల్లాలో మరింత బలపడుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!