TG: తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి సహాయం కోరారు. రుణ భారాన్ని తగ్గించేందుకు సహాయం, మద్దతు ఇవ్వాలని, రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పణగరియా అధ్యక్షతన, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అనీ మాథ్యూస్, మనోజ్ పండా, సౌమ్యా కాంతి ఘోష్ సమక్షంలో జ్యోతీబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ పరిస్థితులను వివరించారు.
![]()
