📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, August 13, 2026
Visitors: 1,639,541  |  525 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపే ప్యాక్డ్ రివ్యూలు, ఫేక్ ఫుడ్ ప్రమోషన్లకు ఎండ్ కార్డ్: ఇన్ఫ్లుయెన్సర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బిగ్ షాక్ఏఐ మోసాలకు ఏఐతోనే చెక్: ఫిబాక్ 2026 సదస్సులో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయ నారి: 8 అడుగుల 10 అంగుళాల జుట్టుతో గిన్నిస్ బుక్‌లోకి రేణు ధరియాల్రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆర్‌బీఐ చెక్: 2027 జనవరి 1 నుంచి కఠినమైన నూతన మార్గదర్శకాలు అమలునీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ సంచలన ఛార్జ్‌షీట్: ముద్రణకు ముందే ప్రశ్నల లీకేజీ.. 13 మందిపై కేసు నమోదుLatest Breaking News from PressMeetతాజా వార్తలుపే ప్యాక్డ్ రివ్యూలు, ఫేక్ ఫుడ్ ప్రమోషన్లకు ఎండ్ కార్డ్: ఇన్ఫ్లుయెన్సర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బిగ్ షాక్ఏఐ మోసాలకు ఏఐతోనే చెక్: ఫిబాక్ 2026 సదస్సులో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయ నారి: 8 అడుగుల 10 అంగుళాల జుట్టుతో గిన్నిస్ బుక్‌లోకి రేణు ధరియాల్రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆర్‌బీఐ చెక్: 2027 జనవరి 1 నుంచి కఠినమైన నూతన మార్గదర్శకాలు అమలునీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ సంచలన ఛార్జ్‌షీట్: ముద్రణకు ముందే ప్రశ్నల లీకేజీ.. 13 మందిపై కేసు నమోదు
Health ⚡ AMP

పే ప్యాక్డ్ రివ్యూలు, ఫేక్ ఫుడ్ ప్రమోషన్లకు ఎండ్ కార్డ్: ఇన్ఫ్లుయెన్సర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బిగ్ షాక్

August 13, 2026 9 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్.. ఇలా సోషల్ మీడియా యాప్స్ ఏది ఓపెన్ చేసినా ‘ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు’ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎలాంటి రుచి లేని ఆహారానికి కూడా ‘వావ్ సూపర్’, ‘బెస్ట్ యాంబియన్స్’ అంటూ లేని హైప్ ఇస్తూ పైసల కోసం చూసే క్రియేటర్ల బాటలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చెక్ పెట్టింది.

చట్టపరమైన ఆమోదాలు, శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఆహార పదార్థాలు, ఆరోగ్య ఉత్పత్తులను ఉచిత ప్రచారం లేదా పెయిడ్ ప్రమోషన్లు చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్పత్తుల భద్రత, చట్టబద్ధతను సరిచూసుకోకుండా బ్రాండ్లను ప్రోత్సహించవద్దని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

గుడ్డిగా నమ్మే మిలియన్ల మంది – సెలబ్రిటీలకు బాధ్యత అవసరం

ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్లు, బ్లాగర్లు, సెలబ్రిటీలు ఇచ్చే రివ్యూలు, సలహాల ఆధారంగానే మిలియన్ల మంది వినియోగదారులు ఆహార పదార్థాలను, హెల్త్ డ్రింక్స్‌ను ఎంచుకుంటున్నారు.

  • బాధ్యతాయుత ప్రచారం: కోట్ల మంది ప్రజలు తమ మాటలను గుడ్డిగా నమ్ముతుండటంతో, సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఇన్ఫ్లుయెన్సర్లపై ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.
  • ఆరోగ్యంపై దెబ్బ: సరిచూసుకోకుండా తప్పుదారి పట్టించే లేదా అతిశయోక్తిగా చెప్పే ఫేక్ ప్రచారాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఒప్పందానికి ముందే ఓరిజినాలిటీ చెక్ చేయాలి!

ఏదైనా ఫుడ్ బ్రాండ్ లేదా రెస్టారెంట్‌తో ప్రచార ఒప్పందం (Paid Promotion) కుదుర్చుకునే ముందు ఆ ఉత్పత్తుల ప్రకటనల్లో నిజాయితీ ఉందో లేదో స్వయంగా సరిచూసుకోవాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లను ఆదేశించింది.

  • ఆధారాలు తప్పనిసరి: ఉదాహరణకు ఒక ప్రొడక్ట్ ‘రోగనిరోధక శక్తిని పెంచుతుంది’ అని కానీ, ‘పోషకాలు పుష్కలంగా ఉన్నాయి’ అని కానీ ప్రచారం చేసేటప్పుడు.. దానికి తగిన శాస్త్రీయ ఆధారాలు, ల్యాబ్ రిపోర్టులు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు క్లారిఫై చేసుకోవాలి.
  • నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రొడక్ట్స్‌ను డబ్బుల కోసం ప్రమోట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

ఫేక్ రివ్యూలు ఇస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష

తప్పుదారి పట్టించే ఆహార ప్రకటనలు, ప్రచారాలు కేవలం నైతిక తప్పిదం మాత్రమే కాదని, అది తీవ్రమైన చట్టపరమైన నేరమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తేల్చిచెప్పింది.

ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే క్రియేటర్లు మరియు సదరు బ్రాండ్లపై ఈ క్రింది చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది:

  • ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (సెక్షన్లు 24, 53)
  • ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్, 2018

ఈ చట్టాల ప్రకారం తప్పుదారి పట్టించే ప్రచారాలు చేసినట్లు రుజువైతే లక్షల రూపాయల భారీ జరిమానాతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!