📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, October 4, 2026
Visitors: 21,525  |  577 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఎవరెస్ట్ జీలకర్ర పొడి రీకాల్.. బేకరీ లైసెన్స్ రద్దు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడాసింగపూర్‌లో ‘FirstDate’ ప్రభుత్వ ఉద్యోగుల కోసం డేటింగ్ యాప్..‘నాకు 55 ఏళ్లు.. ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు’ : అక్బరుద్దీన్‌ ఒవైసీకాక్‌పిట్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు సలాం: రూ. కోటి నజరానా ప్రకటించిన మ్యాన్‌కైండ్ ఫార్మానెస్లే ‘డైరీ వైట్నర్’ నాసిరకం: ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్.. సురక్షితం కాదన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐLatest Breaking News from PressMeetతాజా వార్తలుఎవరెస్ట్ జీలకర్ర పొడి రీకాల్.. బేకరీ లైసెన్స్ రద్దు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడాసింగపూర్‌లో ‘FirstDate’ ప్రభుత్వ ఉద్యోగుల కోసం డేటింగ్ యాప్..‘నాకు 55 ఏళ్లు.. ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు’ : అక్బరుద్దీన్‌ ఒవైసీకాక్‌పిట్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు సలాం: రూ. కోటి నజరానా ప్రకటించిన మ్యాన్‌కైండ్ ఫార్మానెస్లే ‘డైరీ వైట్నర్’ నాసిరకం: ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్.. సురక్షితం కాదన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
Health ⚡ AMP

ఎవరెస్ట్ జీలకర్ర పొడి రీకాల్.. బేకరీ లైసెన్స్ రద్దు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా

October 4, 2026 9 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

దేశవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసే దిశగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక చర్యలు చేపట్టింది. ప్రముఖ మసాలా దినుసుల బ్రాండ్ ఎవరెస్ట్‌‌కు చెందిన జీలకర్ర పొడిలో హానికర పురుగుమందుల అవశేషాలు వెలుగుచూడటంతో రీకాల్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు, తీవ్ర అపరిశుభ్రత కారణంగా మరో ప్రముఖ బేకరీ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎవరెస్ట్ జీలకర్ర పొడిలో పరిమితికి మించి పురుగుమందులు

ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రీ-ప్యాక్డ్ జీలకర్ర పొడి (Pre-packed Cumin Powder) నాణ్యతా ప్రమాణాల పరీక్షల్లో విఫలమైంది.

  • హానికర అవశేషాలు: గోవాలోని రివర్‌సైడ్ రిసార్ట్స్ ప్రాంగణం నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించగా, అనుమతించిన పరిమితికి మించి అజోక్సిస్ట్రోబిన్ (Azoxystrobin), థియామెథోక్సమ్ (Thiamethoxam) పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు తేలింది.
  • ల్యాబ్ పరీక్షల్లోనూ ఫెయిల్: ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఇది ఏమాత్రం సురక్షితం కాదని అధికారులు తేల్చారు. కంపెనీ అప్పీల్ మేరకు రిఫరల్ ఫుడ్ లాబొరేటరీలో రీ-టెస్ట్ నిర్వహించినప్పటికీ ఫలితాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాచ్ నెం. E080668761 నిల్వలను తక్షణమే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని (Recall) ఆదేశించారు.

తీవ్ర అపరిశుభ్రత: ‘క్రియోటివ్ బేకర్స్’ లైసెన్స్ సస్పెన్షన్

మరోవైపు నిబంధనలు గాలికొదిలేసి బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఎం/ఎస్ క్రియోటివ్ బేకర్స్ అండ్ కన్ఫెక్షనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై అధికారులు వేటు వేశారు.

  • పరిశీలనలో విస్తుపోయే నిజాలు: ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లలో దట్టంగా పేరుకుపోయిన బూజు గూళ్లు, గ్రీజు, ధూళి, ఈగలు ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది.
  • తుప్పు పట్టిన డబ్బాల్లో నిల్వలు: ముడి పదార్థాలను తుప్పు పట్టిన కంటైనర్లలో నిల్వ చేయడం, కిటికీలకు నెట్లు లేకపోవడం, సరైన వ్యర్థాల నిర్వహణ మరియు ఆహార భద్రతా రికార్డులు పాటించకపోవడంతో ఆ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌‌ను తక్షణమే రద్దు చేశారు.

(పరిమితికి మించి రసాయనాల అవశేషాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టుల్లో నిర్ధారణ.. బ్యాచ్ నెం. E080668761 ఉపసంహరణకు ఆదేశాలు)

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!