తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది 96.26 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులకు గానూ 4,97,312 మంది పాసయ్యారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్‌తో పాటు తొలిసారిగా ‘మీసేవ’ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. ఫెయిల్ అయిన వారు ఆందోళన చెందకుండా సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని కేశవరావు సూచించారు. నిరాశతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.
![]()




