📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,765,815  |  374 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Andhra ⚡ AMP

పాలిటెక్నిక్ విద్య – ప్రయోజనాలపై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌తో ముఖాముఖి

April 12, 2026 April 12, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రశ్న: ప్రస్తుతం మీ కాలేజీలో నిర్వహిస్తున్న ‘ఉచిత పాలిటెక్నిక్ ప్రవేశ కోచింగ్’ గురించి వివరంగా చెబుతారా?

సమాధానం:
నమస్కారం. పాలిటెక్నిక్ చదవాలనుకునే సామాన్య విద్యార్థుల కోసం మేము ఈ ఉచిత శిక్షణను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే క్లాసులు జరుగుతాయి. విద్యార్థులకు చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాం. తరగతి గదుల్లో ఫ్యాన్ల సౌకర్యం, స్వచ్ఛమైన మంచినీటి వసతి మరియు టాయిలెట్ సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టేలా అన్ని ఏర్పాట్లు చేశాం.

ప్రశ్న: ఈ కోచింగ్‌లో చేరాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?


సమాధానం:
ఈ కోచింగ్ కోసం కనీస అర్హత పదవ తరగతి. ఈ ఏడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు లేదా ఇదివరకే పదవ తరగతి పాస్ అయిన వారు ఎవరైనా దీనికి అర్హులు. అయితే, విద్యార్థులు తప్పనిసరిగా ఈ కోచింగ్ కోసం ముందుగానే దరఖాస్తు చేసుకుని ఉండాలి. తద్వారా మేము వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ మరియు ఇతర సదుపాయాలను సిద్ధం చేయడానికి వీలవుతుంది.

ప్రశ్న: ఈ శిక్షణా కాలం ఎంత ఉంటుంది? రోజువారీ షెడ్యూల్ ఎలా ఉంటుంది?

సమాధానం:
ఈ కోచింగ్ ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 23 వరకు నిరంతరంగా కొనసాగుతుంది. పాలిసెట్ (POLYCET) ప్రవేశ పరీక్షకు ముందు విద్యార్థులకు సిలబస్ మీద పూర్తి అవగాహన కల్పించడమే మా లక్ష్యం. ప్రతిరోజూ మూడు గంటల పాటు గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రాల్లో కీలకమైన అంశాలను బోధిస్తూ, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయిస్తాం.

ప్రశ్న: పాలిటెక్నిక్‌లో మొత్తం ఎన్ని బ్రాంచ్‌లు ఉన్నాయి? విద్యార్థులు వాటిని ఎలా ఎంచుకోవాలి?


సమాధానం: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌లో మొత్తం 28 రకాల బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్ని బ్రాంచ్‌లు ఒకే కాలేజీలో ఉండవు. ఒక్కో కళాశాలలో అక్కడి వనరులను బట్టి కొన్ని నిర్దిష్ట బ్రాంచ్‌లు ఉంటాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న విభాగం (ఉదాహరణకు సివిల్, మెకానికల్, ఈఈఈ) ఏ కాలేజీలో ఉందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించి, వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు.

ప్రశ్న: ప్రతి బ్రాంచ్‌లో సీట్లు ఎన్ని ఉంటాయి? సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది?


సమాధానం: సీట్ల సంఖ్య అనేది కాలేజీని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఒక బ్రాంచ్‌లో 40 నుండి 60 వరకు సీట్లు ఉంటాయి. కొన్ని ప్రత్యేక విభాగాల్లో 30 సీట్లు కూడా ఉండవచ్చు. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో వచ్చే మెరిట్ ర్యాంకు మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఈ సీట్లను కేటాయించడం జరుగుతుంది.

ప్రశ్న: మీ కాలేజీలో ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? గతేడాది ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి?


సమాధానం: మా కాలేజీ ప్లేస్‌మెంట్స్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. గత సంవత్సరం మా విద్యార్థులు నూటికి నూరు శాతం (100%) ప్లేస్‌మెంట్స్ సాధించారు. ఈ ఏడాది కూడా అదే ఊపు కొనసాగుతోంది. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ మరియు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు లభించాయి. డిప్లొమా పూర్తి చేసిన వెంటనే స్థిరపడాలనుకునే వారికి మా కాలేజీ గొప్ప వేదిక.

ప్రశ్న: సాధారణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం ఎటువంటి కంపెనీలు వస్తాయి? ప్రక్రియ ఎలా ఉంటుంది?


సమాధానం: ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ మూడు రకాలుగా జరుగుతుంది. ఒకటి మంగళగిరిలోని హెడ్ ఆఫీస్ ఆధ్వర్యంలో జరిగే ‘సెంట్రల్ డ్రైవ్’. రెండోది విజయవాడలో జరిగే క్లస్టర్ డ్రైవ్. వీటితో పాటు ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహిస్తాం. స్థానికంగా ఉన్న కంపెనీలతో పాటు ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మమ్మల్ని సంప్రదిస్తాయి. ఒకవేళ కాలేజీకి రాలేని పక్షంలో, విద్యార్థులను వేరే చోట్ల జరిగే డ్రైవ్‌లకు మేమే రికమెండ్ చేస్తాం.

ప్రశ్న: చదువుకునే కాలంలోనే విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం కోసం ఇంటర్న్‌షిప్ సౌకర్యం ఉందా?

సమాధానం: ఖచ్చితంగా ఉంది. పాలిటెక్నిక్ చదువులో ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. అందుకే మూడేళ్ల కోర్సులో భాగంగా 6 నెలల పాటు ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉంటుంది. విద్యార్థులను నేరుగా పరిశ్రమలకు పంపిస్తాం. అక్కడ వారు పని నేర్చుకుంటారు. దీనివల్ల చదువు పూర్తయ్యే సరికి వారికి క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన వస్తుంది, ఇది వారికి ఉద్యోగ సంపాదనలో చాలా ప్లస్ అవుతుంది.

ప్రశ్న: ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ సౌకర్యాల గురించి వివరిస్తారా?


సమాధానం: ఇది పేద విద్యార్థులకు చాలా పెద్ద ఊరట. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో పాటు ఓసీ (OC) కేటగిరీ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్ మరియు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థి ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అభ్యసించవచ్చు.

ప్రశ్న: మెరిట్ విద్యార్థుల కోసం ఏవైనా ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు ఉన్నాయా?


సమాధానం: అవును, కేంద్ర ప్రభుత్వానికి చెందిన AICTE ద్వారా మూడు రకాల ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.

ప్రగతి (Pragati): ఇది కేవలం ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం మాత్రమే ఉద్దేశించింది.

సాక్ష్యవాణి (Sakshyawani): ఇది ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ (దివ్యాంగులైన) విద్యార్థుల కోసం.

స్వనాథ్ స్కాలర్‌షిప్ పథకం (SWANATH ):
కోవిడ్ లేదా ఇతర కారణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు ఇది అండగా నిలుస్తుంది.

ప్రశ్న: కాలేజీలో ల్యాబ్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి?


సమాధానం: మా కాలేజీలో అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల నుండి ఫైనల్ ఇయర్ వరకు సివిల్, మెకానికల్ వంటి అన్ని విభాగాలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. పుస్తకాల కోసం లైబ్రరీ మరియు ప్రయోగాల కోసం ల్యాబ్‌లు నిరంతరం అందుబాటులో ఉంచి విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరుస్తున్నాం.

ప్రశ్న: విద్యార్థుల కెరీర్ గైడెన్స్ కోసం మీరు తీసుకునే ప్రత్యేక చర్యలు ఏమిటి?


సమాధానం: కేవలం పాఠాలు చెప్పడమే కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు మేం బాధ్యత తీసుకుంటాం. ప్రతి నెల ప్రత్యేక కెరీర్ గైడెన్స్ క్లాసులు నిర్వహిస్తాం. డిప్లొమా తర్వాత ఉన్నత చదువులకు (B.Tech) ఎలా వెళ్ళాలి, లేదా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లలో ఏ రకమైన ఉద్యోగాలు ఉంటాయి అనే అంశాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం.

ప్రశ్న: చివరగా, పాలిటెక్నిక్ చదవాలనుకునే విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?

సమాధానం: తల్లిదండ్రులకు నా విన్నపం: మీ పిల్లలను కాలేజీలో చేర్చిన తర్వాత మీ బాధ్యత అయిపోయిందని అనుకోవద్దు. ప్రతి 10 రోజులకోసారి కాలేజీకి వచ్చి అధ్యాపకులను కలవండి. విద్యార్థి క్రమశిక్షణ, హాజరు మరియు ఇంటర్నల్ మార్కులను పర్యవేక్షించండి.

విద్యార్థులకు సూచన: పాలిటెక్నిక్ అనేది కేవలం డిగ్రీ కాదు, అదొక నైపుణ్యం. చాలా డెడికేటెడ్ గా, డిసిప్లిన్ గా చదవాలి. ఇక్కడ మీరు పుస్తకాల్లో నేర్చుకున్నది రేపు బయట ఫీల్డ్‌లో నేరుగా చేస్తారు. కాబట్టి ప్రయోగాత్మక విద్యపై దృష్టి పెట్టండి. కష్టపడి చదివితే పాలిటెక్నిక్ మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!