📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,039,206  |  398 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Karimnagar ⚡ AMP

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్

August 21, 2024 August 21, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రాయికల్ మండలం అల్లిపూర్ మరియు మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. బుధవారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలను జగిత్యాల మరియు మెట్పల్లి ఆర్.డి.ఓ తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ అల్లిపూర్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.

అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలకు కాంపౌండ్ వాల్, టాయిలెట్లకు డోర్ లను, మెస్ డోర్స్, చిన్న చిన్న మరమ్మతులను చేయించాలని అధికారులకు సూచించారు. డైనింగ్ హాల్ షెడ్ నిర్మాణానికి ఎస్టిమేషన్ సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ మరియు టీచర్లతో విద్యార్థుల విద్యా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. తదుపరి పెద్దాపూర్ గురుకుల పాఠశాల జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు త్యరగా పూర్తి చేయించాలని ఆదేశాలు జారీచేశారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!