📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 1, 2026
Visitors: 1,702,596  |  683 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంఎవరెస్ట్ మసాలా సంస్థపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) కఠిన చర్యలు: 'ఇంగువ' విక్రయాలపై తాత్కాలిక నిషేధంప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌పై హెచ్చరిక లేబుల్స్‌: ఆహార భద్రతలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) విప్లవాత్మక నిర్ణయంఆకస్మిక వరదలతో అల్లకల్లోలమైన నేపాల్: విదేశీ రెస్క్యూ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్ ప్రభుత్వంLatest Breaking News from PressMeetతాజా వార్తలుతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంఎవరెస్ట్ మసాలా సంస్థపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) కఠిన చర్యలు: 'ఇంగువ' విక్రయాలపై తాత్కాలిక నిషేధంప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌పై హెచ్చరిక లేబుల్స్‌: ఆహార భద్రతలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) విప్లవాత్మక నిర్ణయంఆకస్మిక వరదలతో అల్లకల్లోలమైన నేపాల్: విదేశీ రెస్క్యూ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్ ప్రభుత్వం
Jobs & Careers ⚡ AMP

తపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

August 31, 2026 13 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ ఎత్తున గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పది పాసైన వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇది సువర్ణావకాశం.

ముఖ్యమైన తేదీలు

  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR): ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు: సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకు.
  • దరఖాస్తుల సవరణ (Edit Window): సెప్టెంబర్ 23, 24 తేదీలలో.

పోస్టులు – ఖాళీల వివరాలు

  • మొత్తం ఖాళీలు: 23,757 పోస్టులు.
  • ఆంధ్రప్రదేశ్ సర్కిల్: 917 పోస్టులు.
  • తెలంగాణ సర్కిల్: 419 పోస్టులు.

అర్హతలు, వేతనం మరియు ఎంపిక ప్రక్రియ

  • ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి (మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష కలిగి ఉండాలి) సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.
  • ఇతర అర్హతలు: కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం రావడం తప్పనిసరి.
  • వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది).
  • వేతన శ్రేణి:
    • బీపీఎం (BPM): రూ. 12,000 – రూ. 29,380.
    • ఏబీపీఎం (ABPM) / డాక్ సేవక్: రూ. 10,000 – రూ. 24,470.
  • దరఖాస్తు రుసుము: రూ. 100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు).

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. విధి నిర్వహణ కోసం ల్యాప్‌టాప్/స్మార్ట్‌ఫోన్లను తపాలా శాఖే సమకూరుస్తుంది. అలాగే ఐపీపీబీ (IPPB) సేవలందించినందుకు గాను అదనపు ఇన్సెంటివ్‌లు కూడా లభిస్తాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!