నల్గొండ జిల్లా పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికుల లగేజీ మొత్తం పూర్తిగా కాలిపోగా, షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరిన్ని జిల్లా, స్తానిక వార్తలతో పాటు ఉపాధి అవకాశాల కోసం PRESS MEET న్యూస్ యాప్ ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి.
![]()




