ఇంటి అద్దె చెల్లించలేక ఓ వ్యక్తి తన భార్య, మైనర్ కుమార్తెను యజమాని దగ్గరకు పంపిన ఘోర ఘటన గుజరాత్‌లోని మోర్బిలో జరిగింది. సురేంద్రనగర్‌కు చెందిన ఈ కుటుంబం వలసవచ్చి, రూ.$2,000$ అద్దె ఇల్లు తీసుకుంది. నాలుగు నెలలుగా అద్దె కట్టకపోవడంతో యజమాని ఒత్తిడి తెచ్చాడు. దీంతో సదరు వ్యక్తి దారుణమైన ఒప్పందం కుదుర్చుకోగా, యజమాని తల్లీకూతుళ్లపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడైన భర్తను, ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు.
![]()



