సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం బంజారాహిల్స్‌లో జరిగిన ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. డిపెండెంట్ ఉద్యోగాలపై విచారణ జరుపుతామనడం కార్మికులను అవమానించడమేనని, ప్రభుత్వం తన అవినీతిపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. లిథియం రిఫైనరీ, సోలార్ ఒప్పందాల్లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే రూ.47 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల పక్షాన నిలిచే ఏ పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందని కవిత స్పష్టం చేశారు.
![]()




