బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తనే కారుతో ఢీకొట్టించి చంపిన కిరాతక ఘటన ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌లో వెలుగుచూసింది. అనారోగ్యంతో ఉన్న భర్త రవి త్వరలోనే చనిపోతాడనే ఉద్దేశంతో భార్య ప్రశాంతి గత జూలైలో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ చేయించింది. అయితే 9 నెలలైనా అతను చనిపోకపోవడంతో, బీమా డబ్బుల కోసం తన సోదరుడు శ్రీనివాస్‌తో కలిసి పథకం వేసింది. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, కారుతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారించడంతో ఈ దారుణం బయటపడింది.
![]()

Leave a Reply