సింగర్ గీతా మాధురి భర్త నందు తెలుగు, తమిళ చిత్రాలలో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2006లో ‘ఫొటో’తో ఇండస్ట్రీలోకి వచ్చిన నందు ‘సవారి’తో ఫేమ్ పెంచుకున్నప్పటికీ హిట్ తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు ‘సైకో సిద్ధార్థ’లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న నందు, శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నిర్మాణంలో భాగంగా వ్యవహరిస్తున్నారు. వరుణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో యామిని భాస్కర్, ప్రియాంక, మౌనిక, సాక్షి అత్రి కీలక పాత్రల్లో నటిస్తారు. డిసెంబర్ 12న విడుదలకు రెడీగా ఉన్న టీజర్‌లో బోల్డ్ డైలాగ్స్, బండ బూతులతో నందు రెచ్చిపోయిన సన్నివేశాలు చూపించడంతో విమర్శలు ఎదుర్కొంటుంది.
![]()
