📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,765,774  |  374 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Telangana ⚡ AMP

కాన్సర్..చేతిలో ఓడిపోకు మిత్రమా : మాచన రఘునందన్

November 8, 2025 November 8, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

చెదలు పట్టకుండా..ఇంటి తలుపు లకు టేకు కర్ర వాడతాం..ఇంటికి ఎవరైనా బంధువులు వస్తె..ఇది ఆ బ్రాండు.అది ఈ బ్రాండు అంటూ..మన స్టేటస్ గురించి పరోక్షంగా గొప్పగా చెప్పుకుంటాం. ఇన్ని రకాలుగా మన జీవన విధానం లో అద్భుత నాణ్యత కోసం తపన పడి వాళ్ళం.. ఎందుకో ఏమో.. హృదయాన్నీ, వూపిరి తిత్తుల దగా చేసే ధూమపానం అలవాటు ను మాత్రం ..ఇపుడు కాక పోయినా ఎప్పుడో ఇల్లు ,ఒళ్ళు గుళ్ళచేస్తుంది అని తెలిసి కూడా.. దమ్ము ఆగి”పోయే” దాకా..దమ్ము కొడుతూనే ఉంటాం.

దేహం ఎంత ధృఢంగా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు. పొగాకు దండయాత్ర కు గేట్ తీసినట్టే.
పొగాకు తో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి,తెలుసుకోవటానికి వైద్యం చదవ నవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది.ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్ర లో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు.కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు,ధూమపానం అలవాటు కు ఎలా బలయ్యాడు అని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది.అలాగే తెలుగు సినిమా కు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని,సమ”కూర్చిన” రచయితలు , కవులు,కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్ల నే చిత్ర పరిశ్రమ కు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.
ఒక్కటి చాలు అంటూ.. మొదలెట్టి మెల్లిగా..2,3,4 అలా ..రోజూ డబ్బా ఖాలి చేసి పర్సు ఖాలి చేసుకున్న అభాగ్యులు ఉన్నారు.


సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే. దమ్ము కొట్టినపుడు సిగరెట్, బిడి లో నీ పొగాకు తో పెనవేసుకున్న రసాయనాలు శరీరం లోకి ప్రవేశించి కణాల డి ఎన్ ఏ ను నాశనం చేసే పని లో పడతాయి. అంటే సరళంగా చెప్పాలి అంటే ఓ వ్యక్తి జాతకం ఎలా ఉన్నా..సిగరెట్ అలవాటు కు ముందు ,ఆ తర్వాత అని చెప్పొచ్చు. దొస్తుల వల్ల దమ్ము కొట్టడానికి అలవాటు అయిన వాళ్లు ఉన్నారు. అమ్మా, నాన్న లు ఇచ్చే పాకెట్ మనీ తో గుట్టుగా సిగరెట్ కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండి గా పైసలు ఉన్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటు కు “దగ్గర” అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతే గాక కొన్ని సినిమా ల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్ లు సైతం యువత ను అటు వైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి పాఠశాల ల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. అయినా..ఎవరో వచ్చి చెప్తే నే ..” బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్” అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.

సిగరెట్ ,బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఎంతటి ఉక్కు లాంటి కందరాల్ని ఐనా తుప్పు పట్టించే పని లో ఉంటాయి.పటిష్ట మైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్)అడ్డగోలుగా పెరిగేలా కారకం అవుతాయి తద్వారా కేన్సర్ కు దారి తీస్తాయి.ఆరోగ్యం గా ఉన్న కణాల డి ఎన్ ఏ ను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాల పై ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో. ఓ వ్యక్తి ఆరోగ్యం కు కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.
సిగరెట్,బీడీ అలవాటు వల్ల కణాల డి ఎన్ ఏ ను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు. ఆ తర్వాత మెళ్లిగా రోగ నిరోధక శక్తి నీ దారుణంగా దెబ్బ తీస్తాయి.దీంతో దేహానికి పోరాడదాం అని ఆశ పడే సత్తా ను కూడా సమాధి చేస్తాయి. వెరసి కణాల పై రాక్షసంగా దండ యాత్ర చేసి. దేహాన్ని జబ్బు ల తో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపి లో దిగబడ్డ ప్రాణి లా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి. మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకు తో దోస్తీ దేనికి. దూరంగా ఉంటే ఆరోగ్యం తో పాటు ఐశ్వర్య కూడా మన దగ్గరే ఉంటుంది.

మాచన రఘునందన్ Dy Tahsildar

9441252121

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!