హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం, అలాగే భాజపా పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. గత ఏడాది హరియాణాలో జరిగిన ఎన్నికలకు ముందు హస్తం పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, సవరణలు సరిగా జరుగుతున్నాయని వెల్లడించింది. ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి ప్రత్యుత్తరంగా ప్రశ్నించింది: ‘‘ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో కాంగ్రెస్ ఎటువంటి అభ్యంతరం చూపించిందా? పోలింగ్ ఏజెంట్లు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు?’’
![]()
