నాగర్‌కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. అమ్రాబాద్ మండలంలోని అక్కమహాదేవి గుహల సమీపంలో వర్షాల కారణంగా బురదమయమైన రోడ్డులో బస్సు కూరుకుపోయి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు రోడ్డును మూసివేయడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈగలపెంట ఎస్సై జయన్న, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రయాణికుల సహాయంతో బస్సును రోడ్డుపైకి ఎక్కించి రాకపోకలను పునరుద్ధరించారు.
![]()
