నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా జేఈఇ-2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వచ్చిన తప్పిదానికి సవరణ ఇచ్చింది. మునుపటి బులెటిన్లో CBTలో కంప్యూటర్ స్క్రీన్‌లో కాలిక్యులేటర్ ఉపయోగించగలమని పేర్కొన్నప్పటికీ, నిజానికి పరీక్షలో కాలిక్యులేటర్ అనుమతించబడదు అని NTA స్పష్టం చేసింది. ఈ పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ, సవరణ నోట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసింది. IIT, NITలలో ప్రవేశాల కోసం జరుగుతున్న JEE మెయిన్ పరీక్షల్లో అభ్యర్థులు స్వయంగా గణనలకు సిద్ధంగా ఉండాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ సహాయం లేకుండా ప్రశ్నలను పరిష్కరించవలసిందని NTA సూచించింది.
![]()
