TG : రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ లారీ రాంగ్‌రూట్‌లోకి వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కంకర లోడు బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఘటనపై మంత్రి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరాలని ఆదేశించారు.
![]()
